NLG: ఒడిశాలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన పాక హనుమంతు అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంలలో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు. మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు ఇవాళ ఉదయం వారు ఒడిశాకు వెళ్లారు. హనుమంతు తోబుట్టువులంతా గ్రామానికి చేరుకోనున్నారు.