ASF: కెరమెరి మండలంలోని KGBV లో ఖాళీగా ఉన్న స్కావెంజర్, వెట్ స్వీపరు పోస్ట్‌ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని MEO ఆడే ప్రకాశ్ ఒక ప్రకటనలో తెలిపారు. 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, 18 – 45 ఏళ్ల లోపు మహిళలు అర్హులన్నారు. మండలానికి చెందిన వారికి ప్రాధాన్యం ఉంటుందని, ఈ నెల 29న సర్టిఫికెట్ లతో MRC కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.