క్రిస్మస్ వేళ మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెరక్రూజ్ రాష్ట్రంలోని జొంటోకొమట్లాన్పట్టణంలో బస్సు 600 అడుగుల లోతు లోయలో పడింది. ఈ ఘటనలో 10 మంది చనిపోగా.. మరో 32 మందికి గాయాలయ్యాయి. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు స్వగ్రామాలకు వెళ్తున్న సమయంలో మలుపులతో కూడిన ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న బస్సు నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది.