VSP: పూసపాటిరేగ మండలంలోని గుండపురెడ్డిపాలెం వద్ద హైవేపై బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో విశాఖలోని అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన దక్షిణామూర్తి(58) మరణించారు. చీపురుపల్లి నుంచి విశాఖ వెళ్తుండగా ముందున్న లారీని ఢీకొట్టి కారులో ఇరుక్కుపోయి తీవ్ర గాయాలపాలయ్యారు. ఆయనను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.