VZM: స్థానిక పట్టణంలోని ప్రముఖ (SMB) చర్చిలో క్రిస్మస్ వేడుకలు గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఉమ్మడి విజయనగరం జిల్లా జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏసుక్రీస్తు బోధించిన ప్రేమ, కరుణ, శాంతి మార్గాలు నేటి సమాజానికి అత్యంత అవసరమని పేర్కొన్నారు. క్రిస్మస్ పర్వదినం ప్రతి కుటుంబంలో ఆనందం నింపాలన్నారు.