BHNG: తుర్కపల్లి మండలం, గుజ్జవానికుంట తండలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారు గుగులోతు బద్రి ఈరోజు తమ ఇంటికి స్లాబు పనులు చేపట్టారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడి అవసరాన్ని గుర్తించిన గ్రామ సర్పంచ్ ధూప్ సింగ్ నాయక్ 40 బస్తాల సిమెంటును అందజేశారు. ప్రభుత్వ పథకాలతో పాటు వ్యక్తిగత సహకారంతో పేదల గృహ నిర్మాణానికి అండగా నిలవడం సంతోషంగా ఉందన్నారు.