SKLM: ఎరువుల విక్రయాలలో డీలర్లు నిబంధనలు ఊల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టించిన, ఇతర ప్రాంతాలకు మళ్లించినా లేదా ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయించినా ఎరువుల నియంత్రణ చట్టం-1985 ప్రకారం లైసెన్సులు రద్దు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రైతులు తప్పనిసరిగా రశీదు పొందాలని సూచించారు.