నెల్లూరు: మర్రిపాడు మండలం నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై అచ్చమాంబ గుడి వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రాక్టర్ను బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి మండల పరిధిలోని పొంగూరు గ్రామానికి చెందిన సుబ్బారాయుడుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.