BDK: సుజాతనగర్ రూప్ల తండాలో ఇవాళ జరిగిన అగ్ని ప్రమాదం ఓ నిరుపేద కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కొనసాగుతున్న సమయంలో తాత్కాలికంగా ముందు భాగంలో వేసుకున్న రేకుల షెడ్డులో కరెంట్ షాక్ కారణంగా గ్యాస్ అంటుకుని మంటలు చెలరేగినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనలో షెడ్డులో దాచుకున్న నగదు కాలి బూడిద అయినట్లు పేర్కొన్నారు.