SRPT: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ, మద్యం సేవించి మహిళా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించిన చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి సీహెచ్వో ఆవుల వెంకటేశ్వర్లును సస్పెండ్ చేస్తూ సూర్యాపేట డీఎంహెచ్ఓ డాక్టర్ పెండెం వెంకటరమణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ సేవల్లో క్రమశిక్షణ తప్పితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.