AKP: రాంబిల్లి మండలం వెంకటాపురం పంచాయతీ పరిధిలో గ్రావెల్ లీజుకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని గ్రామస్తులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. 12.5 ఎకరాల్లో మైనింగ్ తవ్వకాలకు వ్యతిరేకంగా మంగళవారం గ్రామస్తులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మైనింగ్ తవ్వకాలు కారణంగా కాలుష్యం పెరుగుతుందన్నారు. గ్రామంలో గల యాదవ కులస్తులు గొర్రెలు మేకలను ఈ కొండపైనే మేపుకుంటామన్నారు.