ATP: ఓ తండ్రి తన ఇద్దరు కుమార్తెలను కాలువలోకి తోసేసిన ఘటన బొమ్మనహాళ్ మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కల్లప్ప అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆదివారం సెలవు కావడంతో ఇంటివద్దే ఉన్న కుమార్తెలకు తండ్రి మాయమాటలు చెప్పి హెచ్ఎల్సీ కాలువ దగ్గరకు తీసుకెళ్లి తోసేశాడు. బాలికల ఆచూకీపై పోలీసులు గాలింపు చేపట్టారు.