NLR: సంగం శివాలయం సెంటర్, బస్ స్టాండ్ సెంటర్లలో ట్రాఫిక్ పై మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని సీఐ శ్రీనివాసులు రెడ్డి నిర్వహించారు. ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ జామ్ లేకుండా ఉండేందుకు పాటించాల్సిన నిబంధనలపై కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రతి ఆటో డ్రైవర్ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సీఐ హెచ్చరించారు.