KMR: కంటి సమస్యల పట్ల విద్యార్థులు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించవద్దని కంటి వైద్యాధికారి హరికృష్ణ రావు సూచించారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు కంటి పరీక్షలు నిర్వహించారు. పలువురు విద్యార్థినుల్లో ఉన్న దృష్టి లోపాలను గుర్తించి, వారికి అవసరమైన సలహాలు ఇచ్చారు. కంటి వ్యాధులతో బాధపడేవారు తప్పనిసరిగా వైద్యుల సూచన మేరకు అద్దాలు ధరించాలన్నారు.