AP: తూ.గో జిల్లాలోని రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులతో మంత్రి లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లోకి రావాలని కోరారు. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో తనపై ట్రోల్స్, మీమ్స్ వైరల్ చేశారని గుర్తుచేశారు. కానీ ఏదీ పట్టించుకోకుండా తాను ఓడిన మంగళగిరి నుంచే పోటీచేసి గెలిచినట్లు చెప్పారు.