E.G: రాజమండ్రి 48వ డివిజన్ సంజీవనగర్లో 25 మంది గర్భిణీలకు సామూహిక సీమంతం వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమిని, మహిళలను ఆనందంగా ఉండేలా బాగా చూసుకుంటేనే భవిష్యత్ తరాలు ఆనందంగా ఉంటాయని పేర్కొన్నారు. భూమిని, మహిళలను గౌరవ ప్రదంగా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.