SRD: సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో వెబ్ కాస్టింగ్ ద్వారా 8 మండలలో జరుగుతున్న పోలింగ్ సరళిని ఎస్పి పరితోష్ పంకజ్ పరిశీలించారు. జిల్లాలో పోలింగ్ జరుగుతున్న తీరును అక్కడి పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ పూర్తయి ఫలితాలు ప్రకటించే వరకు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రఘునందన్ రావు పాల్గొన్నారు.