కడప సెంట్రల్ జైలుకు పలు కేసుల్లో అరెస్టయిన నెల్లూరు లేడీ డాన్ అరుణపై ఇటీవల పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఆమె ప్రస్తుతం నెల్లూరులో జైలు శిక్ష అనుభవిస్తోంది. ఆమెపై పీడీ చట్టం కింద కేసు నమోదు కావడంతో, కడప సెంట్రల్ జైలులోని మహిళా జైలుకు తరలించారు. అలాగే మరో ఇద్దరిపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేయడంతో, వారిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు.