AP: పేద వైద్య విద్యార్థులకు న్యాయం జరిగేలా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించాలని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. దీన్ని అడ్డుకునేందుకు వైసీపీ అధినేత జగన్ దొంగ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. అనకాపల్లిలోని టీడీపీ పార్లమెంట్ పార్టీ కార్యాలయంలో మంత్రి ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.