ELR: కామవరపుకోట మండలం గుంటుపల్లిలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి ఏలూరు జిల్లా వైసీపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కొమ్మిన నరేశ్ మృతి చెందారు. చెరువులో చేపలకు మేత వేసే క్రమంలో పంటి తిరగబడి మృతి చెందినట్లు బంధువులు చెబుతున్నారు. నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.