విశాఖ ఎకనామిక్ రీజియన్‌ను సమగ్ర ప్రణాళికతో గ్లోబల్ ఎకనామిక్ హబ్‌గా చేయడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, పట్టణాభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ, మౌలిక వసతులు ఇలా అన్నివిధాలుగా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు. విశాఖను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దాలని తెలిపారు.