ఖమ్మం ప్రభుత్వ ఐటీఐలో డా.రెడ్డీస్, CSD సంయుక్త ఆధ్వర్యంలో 10 రోజుల సోలార్ ఎనర్జీ శిక్షణ కార్యక్రమం ఈ నెల 15 నుంచి ప్రారంభమవుతుందని ప్రిన్సిపల్ శ్రీనివాసరావు తెలిపారు. SSC, ITI (ఎలక్ట్రిషియన్), డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సన్స్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ఉద్యోగావకాశం కల్పిస్తారని పేర్కొన్నారు.