MNCL: జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో ఎన్నికైన సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని బంజారా యువజన సేవా సంఘం మండల నాయకులు కోరారు. కవ్వాల్ గ్రామానికి నూతనంగా సర్పంచ్‌గా ఎన్నికైన సక్రు నాయక్ దంపతులను ఆ సంఘం నాయకులు శుక్రవారం శాలువా కప్పి సన్మానించారు. గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆ సంఘం నాయకులు కోరారు.