SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే,PUC ఛైర్మన్ కూన రవి కుమార్, ఇవాళ విజయవాడలో మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా రాష్ట్ర అభివృద్ధి, స్థానిక సమస్యలు, భవిష్యత్ కార్యక్రమాలపై ఇద్దరూ సవివరంగా చర్చించినట్లు సమాచారం. పార్టీ బలోపేతం, ప్రజా సేవల మెరుగుదల, యువతకు అవకాశాలపై కూడా ఈ సమావేశంలో పలు సూచనలు, అభిప్రాయాలు పంచుకున్నారు.