NLR: ఇందుకూరుపేట మండలం దేవిస్ పేట గ్రామానికి చెందిన అల్లవరపు సుబ్బారెడ్డి ( 55) పాము కాటుతో మృతి చెందారు. గురువారం కూలి పనుల నిమిత్తం పోయి రాళ్లను ఎత్తు సమయంలో పాముకాటు వేసింది. తోటి కూలీలు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.