NGKL: ఉప్పునుంతల మండల కేంద్రంలోని కొత్త రామ్ నగర్ కాలనీలోని రోడ్డు అధ్వానంగా మారింది. బురద రోడ్డుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న 65 కుటుంబాల గ్రామస్తులు ఈసారి నాయకులను హెచ్చరిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చి మరచిపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామంలో రోడ్డు బాగు చేయిస్తామని కచ్చితంగా హామీ ఇస్తేనే 192 ఓట్లు వేస్తామని తేల్చి చెప్పారు.