AKP: ఛటర్జీపురం భూవివాదం నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ 20న కొయ్యూరు జడ్పీటీసీ వారా నూకరాజు హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించి క్రైమ్ నం.88/2025పై దర్యాప్తు సాగుతోంది. ఇప్పటివరకు 8 మంది అరెస్టు కాగా, గురువారం అచ్చయ్యపేటకు చెందిన PSఅజయ్ కుమార్ను అనకాపల్లి ఎస్డీపీవో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నర్సీపట్నం కోర్టు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.