»Ads For Andhra Media That Insulted The Telangana Movement
Telangana: 10వ ఆవిర్భావ వేడుకల ప్రచార ఖర్చు రూ.300కోట్లు!
Telangana:ప్రజల సొమ్మును తమకు కావాల్సిన వారికి పంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గేట్లు బార్లా తెరిచింది. తెలంగాణ ప్రజలను అవమానించిన, తెలంగాణ ఉద్యమంపై ఎన్నో కుట్రలు పన్నిన, ఎందరో ఉద్యమకారుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఆంధ్రా మీడియాకు తెలంగాణ సర్కార్ మరోసారి వందల కోట్లు పంచిపెట్టింది.
Telangana:ప్రజల సొమ్మును తమకు కావాల్సిన వారికి పంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం(state Govt) గేట్లు బార్లా తెరిచింది. తెలంగాణ(Telangana) ప్రజలను అవమానించిన, తెలంగాణ ఉద్యమంపై ఎన్నో కుట్రలు పన్నిన, ఎందరో ఉద్యమకారుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఆంధ్రా మీడియా(Andra media)కు తెలంగాణ సర్కార్ మరోసారి వందల కోట్లు పంచిపెట్టింది. తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును తెలంగాణ దశాబ్ధి వేడుకల(Telangana Decade Celebrations) పేరుతో సొంత ప్రచారానికి ఖర్చు పెట్టింది. I&PR విభాగం నుండి ప్రతి పేపర్ కు 12 పూర్తి పేజీ ప్రకటనలు ఇచ్చింది. మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పబ్లిసిటీ కోసం భారీ సొమ్ము ఖర్చు పెట్టింది.
ఎక్కడ చూసినా సీఎం కేసీఆర్ ఫొటో కనిపిస్తుండేలా.. ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతోంది. తెలంగాణ ఆవిర్భావ వేడుకల పేరుతో తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీషు, తమిళం, కన్నడ, మరాఠీ, పంజాబీ, ఒరియా వార్తాపత్రికల్లోనూ దండిగ ప్రకటనలు వెలువడ్డాయి. శుక్రవారమే దాదాపు రూ.300 కోట్లు మీడియా పబ్లిసిటీ కోసం వెచ్చించారు. అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని తుంగలో తొక్కిన మీడియా ప్రకటనలకు కోట్లు ఖర్చు పెట్టారు. కనీసం తెలంగాణ ప్రజలకు అవతార దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేందుకు కూడా ఇష్టపడని మీడియా సంస్థలకు కోట్లకు కోట్లు పంచి తెలంగాణ ప్రజలను అవమానించింది రాష్ట్ర ప్రభుత్వం.