TG: హైదరాబాద్ మైత్రీవనంలోని శివమ్ టెక్నాలజీస్ కోచింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటను అదుపు చేస్తున్నారు. ఇప్పటికే కోచింగ్ సెంటర్ నుంచి విద్యార్థులను బయటకు పంపించేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.