MNCL: నస్పూర్ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం సింగరేణి బీసీ, ఓబీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈశ్వర చారి సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వర చారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు శ్రీనివాస్, మారుతి, బద్రి బుచ్చయ్య మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రాణత్యాగం చేసిన తొలి అమరుడు ఈశ్వర చారి అని పేర్కొన్నారు.