KKD: ఏలేశ్వరంలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభముఖ్య అతిథిగా హాజరయ్యారు. యేసుక్రీస్తు ప్రపంచానికి అందించిన ప్రేమ, దయ, కరుణ వంటి శాశ్వత సందేశాలు మానవాళికి మార్గదర్శకం అన్నారు.