PPM: మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా పాయకరావుపేట నుండి ఇచ్చాపురం వరకు తలపెట్టిన అభ్యుదయ సైకిల్ యాత్ర నేడు సీతానగరం మండలం మరిపివలస గ్రామం చేరింది. స్థానిక పాఠశాల విద్యార్థులు మాదకద్రవ్యాల పై అవగాహన కల్పించారు. ర్యాలీ నర్శిపురం వద్దకు చేరుకోగానే పార్వతీపురం ఎఎస్పీ మనీషా రెడ్డి సైకిల్ యాత్రకు డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు.