SRD: సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కలెక్టర్ ప్రావీణ్య సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాలేజీలోని విద్యా, మౌలిక వసతుల పరిస్థితులను సమగ్రంగా తనిఖీ చేశారు. కాలేజీ ఆవరణ, తరగతి గదులు, విద్యార్థుల హాజరు, కోర్సుల నిర్వహణ వంటి అంశాలను కలెక్టర్ పరిశీలించారు. కాలేజీకి హాస్టల్ వసతి సౌకర్యం ఏర్పాటు చేయాలని సిబ్బంది కోరారు.