SRD: జహీరాబాద్ పట్టణం పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా గడ్డం జనార్ధన్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. సంఘం ఆధ్వర్యంలో నేడు ఎన్నికల అధికారి రమేష్ బాబు ఓటింగ్ నిర్వహించారు. మొత్తం ఓటర్లు 2006 ఉండగా 1497 ఓట్లు పోలయ్యాయి. ఇందులో గడ్డం జనార్ధన్‌కు 1041, ప్రత్యర్థి శ్రీనివాస్‌కు 435 రాగా 21 ఓట్లు రిజెక్ట్ అయ్యాయి. సంఘానికి రెండో మారు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.