చిత్తూరు: జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మొత్తం 370 ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. వాటిలో రెవెన్యూ, సర్వే శాఖలకు చెందినవి 226 కాగా, పోలీస్ శాఖకు 14, వైద్య ఆరోగ్య శాఖకు 8 ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపారు. అందిన ఫిర్యాదులను తక్షణమే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత విభాగాలకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.