ADB: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం సాత్నాల మండలంలో పర్యటించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చమని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.