ASR: రంపచోడవరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో 136 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ITDA PO స్మరణ్ రాజ్ అర్జీలు స్వీకరించారు. కొన్ని సమస్యలు అక్కడే పరిష్కరించారు. వై. రామవరం మండలం చవిటి దిబ్బలు గ్రామంలో జూనియర్ కళాశాల, రాజవొమ్మంగిలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలని ప్రజలు కోరారు.