కృష్ణా: సహకార కేంద్ర బ్యాంకులో విధులు నిర్వహించే ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. గుడివాడ లీలామహల్ రోడ్డులోని సహకార కేంద్ర బ్యాంకు వద్ద ఏపీ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగాల యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉద్యోగులకు గ్రాడ్డ్యూటీ చట్టం అమలుపరచాలని, 36 జీవో అమలు చేయాలన్నారు.