సత్యసాయి: పరిగి మండలంలో మరణించిన భజంత్రి గోపాల్ కుటుంబాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సోమవారం ఉదయం పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఆదుకుని అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. గోపాల్ కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు నమోదు చేసి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు.