ATP: రాయదుర్గంలోని నాన్ చెరువులో అక్రమంగా మట్టిని తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్ఐ గొల్ల శ్రీరామ ప్రసాద్ తెలిపారు. తమకు అందిన సమాచారంతో సీఐ జయనాయక్ ఆధ్వర్యంలో తమ సిబ్బంది ట్రాక్టర్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని స్టేషన్‌కు తరలించినట్లు వెల్లడించారు. తదుపరి చర్యల కోసం వాటిని తహశీల్దార్‌కు అప్పగించినట్లు తెలిపారు.