తిరుపతి: ఓజిలి మండలం ఏకలవ్య పాఠశాలలో శనివారం సాయంత్రం ఒక విద్యార్థి చేసిన తప్పుకి తరగతులోని విద్యార్థులందరినీ చితకబాదిన వైస్ ప్రిన్సిపల్ అరుణ్ కుమార్‌పై ఉన్నతాధికారులు శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. మానవత్వం లేని ఆ ఉపాధ్యాయున్ని సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులుజారీ చేశారు.