CTR: చిత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని పూనేపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన ముత్యాలమ్మ ఆలయంలో మహా కుంభాభిషేక వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయం వద్ద వేద పండితుల ఆధ్వర్యంలో హోమాలు, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.