KRNL: కంది పంటకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తుగ్గలిలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు నబి రసూల్, మండల కార్యదర్శి సయ్యద్ సుల్తాన్ ఆధ్వర్యంలో బెంగళూరు–మంత్రాలయం ప్రధాన రహదారిపై ఆందోళన కొనసాగింది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ప్రభుత్వాన్ని తక్షణ చర్యలు తీసుకోవాలనిన్నారు.