KDP: సిద్ధవటం మండలం భాకరాపేట గ్రామ సమీపంలో ఉన్న APSP 11వ పోలీసు బెటాలియన్ ఆవరణలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సోమవారం ఏపీవో నరసింహులు తనిఖీ చేశారు. పనుల్లో అవకతవకలు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కూలీలకు ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.