ప్రకాశం: పొదిలి మండలం కాటూరివారిపాలెంకు చెందిన మాదాల రాంబాబు (42) గుండెపోటుతో మృతి చెందారు. వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించే రాంబాబు జీవనాధారం కోల్పోవడంతో, ఆయన కుటుంబీకులు, స్థానికులు ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాంబాబుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.