ATP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సంతకాల సేకరణ కార్యక్రమం జిల్లాలో కొనసాగుతోంది. సోమవారం రోటరీపురం గ్రామంలోని ఎస్ఆర్ఐటీ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శింగనమల నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ మంత్రి శైలజానాథ్ హాజరై సంతకాలు స్వీకరించారు.