కృష్ణా: గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్సై చంటిబాబు లోక్ అదాలత్ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న చిన్న చిన్న వివాదాలు, పరస్పర అంగీకారంతో ఉండే కేసులను ఇరుపక్షాల సమక్షంలో పరిష్కరించారు. ప్రజలకు చట్టపరమైన అవగాహన కల్పించి, సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.