AP: విశాఖపట్నంలోని గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. నిర్వాసితులు, మత్స్యకారులు పోర్టు గేటు వద్ద ఆందోళన చేపట్టారు. బకాయిల చెల్లింపులలో జాప్యం జరుగుతోందంటూ ధర్నాకు దిగారు. ఆందోళనకారులు ఒక్కసారిగా బారికేడ్లను తోసుకుని పోర్టు లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో తీవ్ర తోపులాట చోటుచేసుకుంది.