ప్రకృతి ఎంతో అందమైనది. ఎన్నో నదులు, జీవాలు, చెట్లు, అడవులు, ప్రకృతి రమణీయ దృశ్యాలతో భూమి (Earth) విలసిల్లుతోంది. అయితే అంతటి అందమైన.. సుందర ప్రదేశాల్లో మానవుడు (Human) అడుగు పెడితే మాత్రం నాశనమవుతున్నాయి. సందర్శన (Visiting) కోసం వెళ్లే మనుషులు అక్కడ ఇష్టరీతిన వ్యవహరిస్తుండడంతో సందర్శనీయ స్థలాలు అత్యంత దయనీయంగా మారుతున్నాయి. సందర్శకులు వదిలే వ్యర్థాలు (Wastage), పడేసే పదార్థాలు (Used Material), వస్తువులతో చెత్త డంపింగ్ యార్డులుగా (Dumping Yard) మారుతున్నాయి. అలాంటి పరిస్థితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరంపై (Mount Everest) కూడా కనిపిస్తోంది. ఎవరెస్ట్ ప్రాంతం చెత్త ప్రదేశంగా మారడంపై పర్యావరణవేత్తలు (Environmentalists) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నేపాల్ – చైనా సరిహద్దులో ఉన్న ఎవరెస్ట్ పర్వతం సముద్ర మట్టానికి 8,848.86 అడుగుల ఎత్తులో ఉంది. ఎప్పుడు మంచుతో (Ice) నిండి ఉండే ఈ శిఖరాన్ని అధిరోహించాలని పర్వతారోహకులు (Mountain Climbers) తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా సాహస యాత్రికులు ఈ శిఖరాన్ని ముద్దాడాలని చూస్తుంటారు. ఇలా ఎవరెస్ట్ పర్వతాన్ని ఇప్పటి దాకా దాదాపు 800 మందికి పైగా అధిరోహించారు. అయితే అధిరోహించిన వారంతా తాము తీసుకువచ్చిన వస్తువులు, తినుబండారాలు (Food Items), ఇతర వస్తువులు అక్కడే పడేసి (Droping) వస్తున్నారు.
ఎంతో ఎత్తున ఉన్న శిఖరాన్ని అధిరోహించిన ఆనందంలో వారంతా అక్కడ కలుషితం (Pollute) చేస్తూ వస్తున్నారు. తీసుకెళ్లిన వస్తువులు బరువు అవుతుండడంతో అక్కడే వదిలేస్తున్నారు. దీంతో పర్వతంపైన ప్లాస్టిక్ వస్తువులు (Plastic Items), తినుబండారాలు, బ్యాగ్ (Bag)లు, బ్యానర్లు (Banners), ఆక్సిజన్ ట్యాంక్ (Oxygen Tank)లు వంటివి వస్తువులు పేరుకుపోయాయి. గుడారాలు (Tents) కూడా అలాగే పడేసి వస్తున్నారు. దీంతో పర్వతం కాస్త చెత్తాచెదారంతో నిండిపోతోంది. ఇది చూసి కొత్తగా పర్వతం ఎక్కడానికి వచ్చే వాళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఎంతో సుందరమైన ప్రదేశం కూడా డంపింగ్ యార్డ్ గా మారింది. ఇది చూసిన పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనుషులు ఇలాగే ప్రవర్తిస్తే కొన్నాళ్లు పోతే అక్కడ చూడడానికి చెత్తాచెదారం తప్ప ఇంకేమీ కనిపించదని పేర్కొంటున్నారు. స్థానిక అధికార యంత్రాంగం (Officials) చేస్తున్న సూచనలు పర్వతారోహకులు పట్టించుకోవడం లేదు. వెంటనే అక్కడ పారిశుద్ధ్య పనులు (Sanitation Works) చేపట్టాలని ప్రకృతి ప్రేమికులు (Nature Lovers) కోరుతున్నారు. అయితే మనుషులు కూడా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఒక్క ఎవరెస్ట్ పర్వతమే కాదు సందర్శనీయ స్థలాలకు (Tourist Places) వెళ్లినప్పుడు అక్కడ పరిశుభ్రత పాటించాలి. తిన్న పదార్థాలు, ఇతర వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పడేస్తే పర్యాటక స్థలాలు కూడా చెత్తాచెదారంతో నిండిపోతాయి. అందంగా ఉన్న వాటిని మనం మరింత అందంగా ఉండేలా సహకరించాలి.
Disheartening to see the accumulation of garbage at Camp IV on Mt #Everest (8848.86 m). It's high time we address this issue with urgency and commitment. Let's demand stricter regulations, enforcement of clean climbing practices, and effective waste management strategies. Video… pic.twitter.com/KGMlRmUuZk