WGL: కాళోజి నారాయణరావు వర్సిటీ పరిధి కళాశాలల్లో ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నూతన వీసీ రమేష్ రెడ్డి హెచ్చరించారు. వర్సిటీ వీసీగా ఇవాళ ఆయన పదవీ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ర్యాగింగ్ చేసినట్లు రుజువు అయితే కళాశాల నుంచి అడ్మిషన్ సైతం తొలగిస్తామన్నారు. వైద్య విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసలు కావద్దని సూచించారు.